తమ్మినేని చెల్లని నోటు: కూన

ABN , First Publish Date - 2022-12-07T03:44:12+05:30 IST

దేశంలో వెయ్యి రూపాయల నోటుకు, రాష్ట్రంలో స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ మాటకు విలువ లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఎద్దేవా చేశారు.

తమ్మినేని చెల్లని నోటు: కూన

అమరావతి, డిసెంబరు6 (ఆంధ్రజ్యోతి): దేశంలో వెయ్యి రూపాయల నోటుకు, రాష్ట్రంలో స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ మాటకు విలువ లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఎద్దేవా చేశారు. ఏ ఎండకా గొడుగు పట్టే తమ్మినేనిని చూసి ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందన్నారు. జగన్‌రెడ్డి బీసీలను ఉద్ధరించినట్లు తమ్మినేని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. సీతారామ్‌ చెడ్డీలు వేసుకుని తిరిగే రోజుల్లోనే సామాజిక న్యాయానికి నాందీ పలికిన పార్టీ టీడీపీ అని చెప్పారు.

Updated Date - 2022-12-07T03:44:13+05:30 IST