వైసీపీ నేతల అరాచకం.. ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-08T04:16:34+05:30 IST

అమలాపురం (Amalapuram)లో పంచాయతీ కార్యదర్శి భవాని ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సీ వర్గానికి చెందిన భవానీ...

వైసీపీ నేతల అరాచకం.. ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

కోనసీమ (Konaseema): అమలాపురం (Amalapuram)లో పంచాయతీ కార్యదర్శి భవాని ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సీ వర్గానికి చెందిన భవానీ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. వైసీపీ (Ycp) నేతల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి.  ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ కార్యదర్శిగా భవాని విధులు నిర్వహించారు. తాము చెప్పిన పని చేయలేదని కలెక్టర్‌కు వైసీపీ నేతల ఫిర్యాదు చేశారు.  దాంతో 2 రోజుల క్రితం ఆమె మామిడికుదురు మండలం అప్పనపల్లి కార్యదర్శిగా బదిలీ అయ్యారు. అయితే ఫిర్యాదు వెనక్కు తీసుకునేందుకు వైసీపీ నేతలు డబ్బులు డిమాండ్ చేశారు. మనస్తాపం చెందిన భవాని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అమలాపురం డీఎల్పీవో విక్టర్  కారణమని పోలీసులకు మృతురాలి భర్త ఫిర్యాదు చేశారు. 

Read more