కనువిందు చేస్తున్న ‘కోన’

ABN , First Publish Date - 2022-08-04T08:21:53+05:30 IST

కనువిందు చేస్తున్న ‘కోన’

కనువిందు చేస్తున్న ‘కోన’

సీమకు భారీ వర్షాలు కొత్త కళను తెచ్చాయి. జాలువారుతున్న వర్షపు నీటితో కోన జలపాతం కనువిందు చేస్తోంది. అనంతపురం జిల్లా యాడికి మండలంలోని కోనుప్పలపాడు గ్రామం వద్ద ఉన్న ఈ జలపాతం ఈ ప్రాంత వాసులను ఆకట్టుకుంటోంది. కోనరామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద బుధవారం కొండలపై నుంచి నీరు కిందకు పరవళ్లు తొక్కింది. నంద్యాల జిల్లా సరిహద్దు ఆనుకొని ఉన్న కొండల పైభాగాన మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం భారీ వర్షం కురవడంతో వర్షపునీరు కొండలకు దిగువ భాగాన ఉన్న కోన రామలింగేశ్వరాస్వామి ఆలయం వద్ద జలపాతంలా మారి కిందకు దూకుతోంది. జలపాతాన్ని చూసేందుకు సమీప ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. 

- యాడికి

Read more