రెండు లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడం ప్రభుత్వ వైఫల్యమే: Kollu Ravindra
ABN , First Publish Date - 2022-06-07T21:35:24+05:30 IST
రెండు లక్షల మంది టెన్త్ విద్యార్థులు ఫెయిల్ అవడం ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని కొల్లు రవీంధ్ర అన్నారు.

Amaravathi: రెండు లక్షల మంది టెన్త్ విద్యార్థులు ఫెయిల్ అవడం ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర (Kollu Ravindra) విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ దీనిపై సీబీఐ (CBI)తో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీచర్లను ప్రభుత్వం మానసికంగా వేధించిందని, ఫలితాలు ప్రకటిస్తామన్న తేదీన కాకుండా మూడు రోజులు ఆలస్యం ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. అమ్మఒడి భారం తగ్గించుకునేందుకనే అనుమానం కలుగుతోందన్నారు. అందుకే సీబీఐతో దర్యాప్తు కోరుతున్నామన్నారు. విద్యార్థులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. తల్లి తండ్రులు కూడా ధైర్యంగా ఉండాలన్నారు. దీని వెనుక ఉన్న కుట్రను బయటపెట్టే వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల తరుపున పోరాటం చేస్తామని, అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.