‘సమాధానం చెప్పలేక అరెస్టులు చేస్తారా?’

ABN , First Publish Date - 2022-10-02T23:11:48+05:30 IST

‘సమాధానం చెప్పలేక అరెస్టులు చేస్తారా?’

‘సమాధానం చెప్పలేక అరెస్టులు చేస్తారా?’

విజయవాడ: సీఎం జగన్ రెడ్డి ప్రజాస్వామ్య విలువల్ని మంటగలిపి అరాచక పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఐటీడీపీలో చింతకాయల విజయ్ యాక్టివ్‌గా ఉన్నందుకే కక్ష్యసాధింపు చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలు ఎత్తి చూపటం తమ బాధ్యత అన్నారు. సమాధానం చెప్పలేక అరెస్టులు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ పాలనలో బీసీలను అణగద్రొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read more