కీచక కౌన్సిలర్
ABN , First Publish Date - 2022-05-19T08:53:22+05:30 IST
తనను వేధిస్తున్న వైసీపీ కౌన్సిలర్‌పై వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో బుధవారం ఈ ఘటన జరిగింది. బాధితురాలు

అర్ధరాత్రి తలుపు కొట్టడం.. రాళ్లు విసరడం
వివాహితపై వైసీపీ ప్రజాప్రతినిధి వేధింపులు
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో ఘోరం
బస్టాండ్ వద్ద చెప్పుతో కొట్టినా.. మారని తీరు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం: ఎస్‌ఐ
హిందూపురం టౌన్, మే 18: తనను వేధిస్తున్న వైసీపీ కౌన్సిలర్‌పై వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో బుధవారం ఈ ఘటన జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు కౌన్సిలర్ శేషాద్రి కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. ఆమె భర్తను మద్యానికి బానిసచేసి, తరచుగా ఇంటివద్దకు వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. అర్ధరాత్రి ఇంటి తలుపు కొట్టడం, రాళ్లు విసరడం చేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు పదిరోజుల క్రితం శేషాద్రిని పెనుకొండ ఆర్టీసీ బస్టాండు వద్ద చెప్పుతో కొట్టింది. అయినా అతడి తీరులో మార్పు రాలేదు. అతడి వికృత చేష్టలు భరించలేక బాధితురాలు బుధవారం పెనుకొండ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వేధింపులు ఆపకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బాధితురాలు ఫిర్యాదు చేశారని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రమే్‌షబాబు చెప్పారు.