కేసీఆర్‌ నంబర్‌వన్‌ ద్రోహి: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2022-10-07T08:46:56+05:30 IST

కేసీఆర్‌ నంబర్‌వన్‌ ద్రోహి: తులసిరెడ్డి

కేసీఆర్‌ నంబర్‌వన్‌ ద్రోహి: తులసిరెడ్డి

కడప(కలెక్టరేట్‌), అక్టోబరు 6: ‘‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన వారిలో నంబర్‌ ఒన్‌ ద్రోహి కేసీఆర్‌. టీఆర్‌ఎ్‌సకు వీడ్కోలు పలికి, బీఆర్‌ఎస్‌ పేరుతో రాష్ట్రంలో అడుగు పెడితే తరిమి తరిమి కొడతాం’’ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కడపలో ఆయన మాట్లాడారు. ‘‘సీమాంధ్ర ప్రజలంటే కేసీఆర్‌కు చులకన. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రులను పంచెలు ఊడదీసి కొడతామని, వారు తినే బిర్యాని పేడలాగా ఉంటుందని తీవ్ర పదజాలంతో ఆంధ్రుల హృదయాలను గాయపరిచాడు. ప్రత్యేక హోదాకు, పోలవరం నిర్మాణానికి అడ్డంకిగా మారిన కేసీఆర్‌కు ఇక్కడ స్థానం లేదు. బీఆర్‌ఎస్‌, టీఆర్‌ఎ్‌సకు ఇక వీఆర్‌ఎస్సే. జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానులు కడతానని జగన్నాటకం ఆడుతున్నారు. దమ్ము ధైర్యం ఉంటే మూడు రాజధానులు నిర్మించి చూపాలి. కేసీఆర్‌, జగన్‌ చపలచిత్తులు’’ అని తులసిరెడ్డి విమర్శించారు.


Updated Date - 2022-10-07T08:46:56+05:30 IST