Kanna Laxminarayana: జగనే వెళ్లలేకపోతే ఎమ్మెల్యేలు ఎలా వెళతారు?

ABN , First Publish Date - 2022-09-09T03:46:43+05:30 IST

సీనియర్ జర్నలిస్టు కందుల రమేష్ రాసిన "అమరావతి వివాదాలు-వాస్తవాలు" పుస్తకావిష్కరణ జరిగింది. మాజీ సీఎం చంద్రబాబు....

Kanna Laxminarayana: జగనే వెళ్లలేకపోతే ఎమ్మెల్యేలు ఎలా వెళతారు?

విజయవాడ (Vijayawada): సీనియర్ జర్నలిస్టు కందుల రమేష్ (Kandula Ramesh) రాసిన "అమరావతి వివాదాలు-వాస్తవాలు" పుస్తకావిష్కరణ జరిగింది. మాజీ సీఎం చంద్రబాబు (Ex Cm Chandrababu) చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna Laxminarayana), కాంగ్రెస్ నేత తులసిరెడ్డి (Tulasireddy), సీపీఐ నేత రామకృష్ణ కార్యక్రమానికి హాజరయ్యారు.


ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజల్లోకి వెళ్లాలంటేనే సీఎం జగన్ (Cm Jagan) భయపడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కర్ఫ్యూ పెడుతున్నారని ఎద్దేవా చేశారు.  మూడేళ్ల పాలన తర్వాత సీఎం జగనే జనంలోకి వెళ్లలేకపోతే ఎమ్మెల్యేలు మాత్రం ఎలా వెళతారని ప్రశ్నించారు. అమిత్ షా (Amit Shah).. తిరుపతిలో అమరావతికి అండగా నిలవాలని చెప్పారన్నారు. మూడు రాజధానులు అన్న తర్వాత ఒక రాజకీయ తీర్మానం చేశారని.. ప్రభుత్వాన్ని నమ్మి 33 వేల ఎకరాల భూమి రైతులు ఇచ్చారని కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. 


Updated Date - 2022-09-09T03:46:43+05:30 IST