Kanakamedala Ravindra: సంకల్ప సిద్ధి వ్యవహారంపై ఎంపీ కనకమేడల ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-12-15T16:28:42+05:30 IST
సంకల్ప సిద్ధి మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఎంపీ కనకమేడల రవీంద్ర (Kanakamedala Ravindra) ఫిర్యాదు చేశారు.
ఢిల్లీ: సంకల్ప సిద్ధి మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఎంపీ కనకమేడల రవీంద్ర (Kanakamedala Ravindra) ఫిర్యాదు చేశారు. వివిధ స్కీమ్‌ల పేరుతో ఏపీ, తెలంగాణ, కర్నాటక (Telangana Karnataka)లోని గ్రామీణ ప్రజలను మోసం చేశారని తెలిపారు. తక్కువ కాలంలో రెట్టింపు డబ్బులు చెల్లిస్తామని మోసగించి.. బాధితుల నుంచి వందల కోట్లు వసూలు చేశారని పేర్కొన్నారు. సంకల్ప సిద్ధి వ్యవహారంలో వైసీపీ (YCP) కీలక నేతల హస్తం ఉందని, పేదల డబ్బులు తిరిగి ఇప్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలని, ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని కనకమేడల రవీంద్ర డిమాండ్ చేశారు. సంకల్ప సిద్ధి మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. సంకల్పసిద్ది మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థలోని ఉద్యోగులను పోలీసులు విచారిస్తున్నారు. 38 మంది ఉద్యోగులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. వారిలో 8 మంది మహిళలు ఉన్నారు.