అందరికీ కల్యాణమస్తు, షాదీ తోఫా: సీపీఎం
ABN , First Publish Date - 2022-10-07T08:51:19+05:30 IST
అందరికీ కల్యాణమస్తు, షాదీ తోఫా: సీపీఎం
అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): పేద వధూవరులకు అమలు చేస్తున్న కల్యాణమస్తు పథకాన్ని చదువుతో నిమిత్తం లేకుండా అందరికీ వర్తింపజేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. కల్యాణమస్తు పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే వధువు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన ముందు పెట్టారని, ఇప్పుడు వరుడు కూడా 10వ తరగతి పాస్ కావాలనే నిబంధన చేర్చారని తెలిపారు. పేద, బడుగు, బలహీనవర్గాలను ఈ పథకానికి దూరం చేస్తున్న నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ పథకానికి ఆదాయ పరిమితిని సంవత్సరానికి రూ.5 లక్షలకు పెంచాలని కోరారు.