కాల్వ శ్రీనివాసులు అరెస్ట్ సరికాదు: Paritala Sriram

ABN , First Publish Date - 2022-05-21T23:22:46+05:30 IST

మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు (Kalava Srinivasulu) అరెస్ట్ సరికాదని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ (Paritala Sriram) తప్పుబట్టారు.

కాల్వ శ్రీనివాసులు అరెస్ట్ సరికాదు: Paritala Sriram

రాయదుర్గం: మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు (Kalava Srinivasulu) అరెస్ట్ సరికాదని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ (Paritala Sriram) తప్పుబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పొప్పులు ఆలోచించకుండా లాఠీచార్జ్‌ చేయడం బాధాకరమన్నారు. టీడీపీ నుంచి శాంతిభద్రతల సమస్య తలెత్తదని తెలిపారు. లా అండ్ ఆర్డర్‌ సమస్య అయితే సవాల్ విసిరిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారం ఉందికదాని పోలీసులను వాడుకుంటే.. రేపు ఎలా ఉంటుందో ఆలోచించాలని హెచ్చరించారు. తిరుపతికే దిక్కులేదని, రాయదుర్గంలో దేవుళ్లకు దిక్కెక్కడిదని శ్రీరామ్‌ ప్రశ్నించారు.

Read more