న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్
ABN , First Publish Date - 2022-06-28T09:00:06+05:30 IST
రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా జస్టిస్ సి. ప్రవీణ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా జస్టిస్ సి. ప్రవీణ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి తర్వాత స్థానంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తి న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా పట్నాకు బదిలీ అయ్యారు.