కోనసీమ ఘటనపై న్యాయవిచారణ జరపాలి

ABN , First Publish Date - 2022-05-30T09:04:21+05:30 IST

కోనసీమలో జరిగిన అల్లర్లపై న్యాయవిచారణ జరిపించాలని గవర్నర్‌ హరిచందన్‌ను కాంగ్రెస్‌ నాయకులు కోరారు. విజయవాడ రాజ్‌భవన్‌లో పీసీసీ ఉపాధ్యక్షుడు జంగా గౌతమ్‌, పార్టీ నాయకులు రాజీవ్‌ రతన్‌, నరహరశెట్టి నరసింహారావు, రవికాంత్‌,

కోనసీమ ఘటనపై న్యాయవిచారణ జరపాలి

సుబ్రహ్మణ్యం కేసు సీబీఐకి ఇవ్వాలి, కాంగ్రెస్‌ డిమాండ్‌.. గవర్నర్‌కు వినతి


విజయవాడ, మే 29(ఆంధ్రజ్యోతి): కోనసీమలో జరిగిన అల్లర్లపై న్యాయవిచారణ జరిపించాలని గవర్నర్‌ హరిచందన్‌ను కాంగ్రెస్‌ నాయకులు కోరారు. విజయవాడ రాజ్‌భవన్‌లో పీసీసీ ఉపాధ్యక్షుడు జంగా గౌతమ్‌, పార్టీ నాయకులు రాజీవ్‌ రతన్‌, నరహరశెట్టి నరసింహారావు, రవికాంత్‌, పి.వై.కిరణ్‌కుమార్‌ ఆదివారం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అమలాపురం హింసాకాండపై హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ చేయించాలని కోరారు. కాకినాడలో దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.

Read more