దొంగతనం చేసినట్లు రాసివ్వాలని ఒత్తిడి తీసుకు వస్తావా?: డీఎస్పీపై జేసీ ఫైర్
ABN , First Publish Date - 2022-10-10T19:38:16+05:30 IST
తాడిపత్రి డీఎస్పీ చైతన్య (Tadipatri DSP Chaitanya)పై కోర్టులో పలు ప్రైవేట్ కేసులు నమోదయ్యాయి.
Ananthapuram : తాడిపత్రి డీఎస్పీ చైతన్య (Tadipatri DSP Chaitanya)పై కోర్టులో పలు ప్రైవేట్ కేసులు నమోదయ్యాయి. టీడీపీ నేతలు (TDP Leaders), జేసీ కుటుంబ సన్నిహితులను కేసుల పేరుతో వేధింపులకు గురిచేయడంపై నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. రెండు రోజుల క్రితం స్టేషన్‌లో సంతకం చేసేందుకు వెళ్లిన జేసీ సన్నిహితుడు చవ్వా గోపాల్ రెడ్డిని రాత్రి వరకూ పోలీసులు స్టేషన్‌లోనే ఉంచుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ.. డీఎస్పీ చైతన్య ఏ విధంగా పాసయ్యాడో... పరీక్ష ఎవరు రాశారోననే అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. డీఎస్పీ చైతన్య మాట్లాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. ‘ప్రభాకర్ రెడ్డి దొంగతనం చేసినట్లు రాసివ్వాలని గోపాల్ రెడ్డిపై ఒత్తిడి తీసుకు వస్తావా? ఎన్ని కేసులు పెడుతావో పెట్టు..’ అంటూ మండిపడ్డారు. డీఎస్పీ చైతన్యను వదిలేది లేదన్నారు. ప్రైవేట్ కేసులు వేస్తామని.. తమను కేసుల పేరుతో వేధిస్తే నీకేం వస్తుందని జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు.