ఇద్దరు ఎంపీల నుంచి అధికారం వచ్చే వరకు...: పవన్

ABN , First Publish Date - 2022-07-03T00:11:55+05:30 IST

విభజన తర్వాత ఇక్కడ టీడీపీకి.. అక్కడ టీఆర్‌ఎస్‌కి అవకాశం ఇచ్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

ఇద్దరు ఎంపీల నుంచి అధికారం వచ్చే వరకు...: పవన్

అమరావతి: విభజన తర్వాత ఇక్కడ టీడీపీకి.. అక్కడ టీఆర్‌ఎస్‌కి అవకాశం ఇచ్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏర్పడే ప్రభుత్వాలు నిలబడవన్నారు. దేశంలో మత ప్రస్తావన లేని ప్రభుత్వాలు రావాలని చెప్పారు. దేశంలోని భాష, యాసను అందరూ గౌరవించాలని ఆయన సూచించారు. ప్రాంతీయతను గుర్తించకపోతే జాతీయవాదం రాదన్నారు. ఇద్దరు ఎంపీల నుంచి అధికారం వచ్చే వరకు బీజేపీ పోరాటం చేసిందన్నారు. ఏ పార్టీ అయినా మొదట చిన్నగానే ప్రారంభమవుతుందన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో పురుషుల ఆధిక్యమే ఉందన్నారు. జనసేనలో మహిళలను చైతన్యవంతులుగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 



Updated Date - 2022-07-03T00:11:55+05:30 IST