‘రాజకీయాల్లో రియల్ నటనకు నిలువెత్తు రూపం జగన్’
ABN , First Publish Date - 2022-07-09T14:46:33+05:30 IST
వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగంపై జనసేన నేత పోతిన వెంకట మహేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
విజయవాడ: వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) ప్రసంగంపై జనసేన నేత పోతిన వెంకట మహేష్ (Potina venkata mahesh) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ప్లీనరీ (Plenaray) వేదికపై మహానటుడు వైఎస్ జగన్ మరొకసారి అద్భుతంగా నటించి ఆస్కార్ కు అర్హత సాధించారు. మేకప్ వేసుకొని సినిమాల్లో నటిస్తారు.. కానీ సీఎం జగన్ జనం మధ్య మేకప్ లేకుండా నటించడం కాదు జీవించేస్తారు. రాజకీయాల్లో రియల్ నటనకు నిలువెత్తు రూపం సీఎం జగన్’’ అంటూ పోతిన మహేష్ ట్వీట్ చేశారు.