జనసేన నేత కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-06-07T21:25:26+05:30 IST

జనసేన నేత కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం దగ్గర ఏపీ ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనసేన నేత కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు

తిరుపతి: జనసేన నేత కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం దగ్గర ఏపీ ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి రెండేళ్ల పదవీకాలం పొడిగింపు తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. టీటీడీ వ్యవస్థపైనే తమ పోరాటమన్నారు. ఈనెల 14 తర్వాత కేంద్ర ఉత్తర్వులపై కోర్టుకెళ్తామని తెలిపారు. ధర్మారెడ్డి కొనసాగింపు ఏపీ బీజేపీ నేతలకు ముందే తెలుసన్నారు. ఏపీ బీజేపీ నేతలకు ఢిల్లీలో విలువ లేదని విమర్శించారు. 

Read more