-
-
Home » Andhra Pradesh » Jagan to Tirupati tomorrow bbr-MRGS-AndhraPradesh
-
CM Jagan: రేపు తిరుపతికి జగన్
ABN , First Publish Date - 2022-09-27T02:05:09+05:30 IST
తిరుమల (tirumala) శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ (jagan) మంగళవారం తిరుపతి రానున్నారు.

తిరుపతి: తిరుమల (tirumala) శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ (jagan) మంగళవారం తిరుపతి రానున్నారు. రేపు సాయంత్రం తిరుపతిలో గ్రామదేవతగా ప్రసిద్ధి చెందిన తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహిస్తారు. తర్వాత అలిపిరి (alipiri) చేరుకుని అక్కడ ఆర్టీసీ డిపో నుంచీ తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తారు. అనంతరం తిరుమల వెళ్ళి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రికి పెద్ద శేష వాహనోత్సవంలో పాల్గొంటారు. మంగళవారం రాత్రి తిరుమలలోనే బస చేస్తారు. బుధవారం ఉదయం వేకువ జామున మరోసారి శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని, లక్ష్మీ వి.పి.ఆర్ విశ్రాంతి గృహాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 9.45 గంటలకల్లా విమానాశ్రయం చేరుకుని విమానంలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు వెళ్తారు.