5న తిరుపతికి జగన్
ABN , First Publish Date - 2022-05-01T22:02:35+05:30 IST
ఈ నెల 5న తిరుపతికి సీఎం జగన్ రానున్నారు. జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు.

అమరావతి: ఈ నెల 5న తిరుపతికి సీఎం జగన్ రానున్నారు. జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అలిపిరిలో చిల్డ్రన్స్ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌కి శంకుస్థాపన చేస్తారు. అనంతరం టాటా క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించనున్నారు. విద్యా కానుక బహిరంగ సభలో జగన్ పాల్గొననున్నారు. అనంతరం జగన్ తిరిగి తాడేపల్లి వెళ్తారు. జగన్ పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.