వివేకా హత్య వెనుక జగన్‌: నారా లోకేశ్‌

ABN , First Publish Date - 2022-03-01T00:47:16+05:30 IST

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య వెనుక ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందని టీడీపీ నేత నారా లోకేశ్‌ ఆరోపించారు.

వివేకా హత్య వెనుక జగన్‌: నారా లోకేశ్‌

విశాఖపట్నం: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య వెనుక ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందని టీడీపీ నేత నారా లోకేశ్‌ ఆరోపించారు. ‘సాక్షి’పై పరువునష్టం దావా కేసుకు సంబంధించి సోమవారం విశాఖలో కోర్టు వాయిదాకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన న్యాయస్థానం వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘‘బాబాయ్‌ని చంపింది అబ్బాయే అని చెబుతున్నారు. చివరకు జగన్‌రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. సొంత బాబాయి హత్యకు గురైతే జగన్‌ ఎంతో ఆవేదన చెందాలి. కానీ ఆయనలో ఆవేదన కనిపిస్తున్నదా?’’ అని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి సునీతను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పూర్వ డీజీపీ సవాంగ్‌తో కలిసి జగన్‌ బెదిరించారని లోకేశ్‌ ఆరోపించారు. వివేకానందరెడ్డిని చంద్రబాబు చంపించారని దారుణమైన అబద్ధలాడడం జగన్‌కే చెల్లించిందని ఎద్దేవా చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు తన బాబాయిని చంద్రబాబు హత్య చేయించారని దొంగ ఏడ్పులు ఏడ్చి అప్పట్లో సీబీఐ విచారణకు డిమాండ్‌ చేసిన జగన్మోహనరెడ్డి, అధికారంలోకి వచ్చిన తరువాత సీబీఐ దర్యాప్తును ఎందుకు వద్దన్నారు? అని లోకేశ్‌ ప్రశ్నించారు. 

Updated Date - 2022-03-01T00:47:16+05:30 IST