రాష్ట్రాన్ని జగన్‌ నాశనం చేస్తున్నారు: బీటెక్‌ రవి

ABN , First Publish Date - 2022-03-05T20:52:12+05:30 IST

రాష్ట్రాన్ని సీఎం జగన్‌రెడ్డి నాశనం చేస్తున్నారని టీడీపీ నేత బీటెక్‌ రవి ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో గత మూడేళ్లుగా రాజధాని వికేంద్రీకరణ

రాష్ట్రాన్ని జగన్‌ నాశనం చేస్తున్నారు: బీటెక్‌ రవి

కడప: రాష్ట్రాన్ని సీఎం జగన్‌రెడ్డి నాశనం చేస్తున్నారని టీడీపీ నేత బీటెక్‌ రవి ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో గత మూడేళ్లుగా రాజధాని వికేంద్రీకరణ పేరుతో ప్రజలను అయోమయానికి గురి చేశారని విమర్శించారు. ప్రత్యేక హోదాను పక్కన పెట్టేశారని, చట్టాలకు విలువ లేకుండా దొడ్డిదారిన ఆర్డినెన్స్ జారీ చేశారని దుయ్యబట్టారు. పరిపాలన వికేంద్రీకరణ కాదని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని డిమాండ్ చేశారు. ఇకనైనా అనవసర రాద్ధాంతం చేయడం మానుకోవాలని బీటెక్‌ రవి హితవుపలికారు.

Read more