వారికి జగన్ సర్కార్ న్యూ ఇయర్ స్పెషల్ గిఫ్ట్

ABN , First Publish Date - 2022-12-31T11:43:30+05:30 IST

మందుబాబులకు జగన్ సర్కార్ న్యూ ఇయర్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేసింది. నేడు, రేపు (డిసెంబర్ 31, జనవరి ఒకటి) అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాప్‌లు తెరిచే ఉండనున్నాయి.

వారికి జగన్ సర్కార్ న్యూ ఇయర్ స్పెషల్ గిఫ్ట్

అమరావతి : మందుబాబులకు జగన్ సర్కార్ న్యూ ఇయర్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేసింది. నేడు, రేపు (డిసెంబర్ 31, జనవరి ఒకటి) అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాప్‌లు తెరిచే ఉండనున్నాయి. బార్లకు అర్ధరాత్రి ఒంటిగంట వరకూ అనుమతి లభించనుంది. గత ఏడాదితో పోలిస్తే మద్యం షాప్‌లకు 2 గంటల అదనపు సమయం కేటాయించనున్నారు. బార్లకు ఒక గంట అదనపు సమయం కేటాయించనుంది. ఏపీలో మద్యపాన నిషేధం ఎక్కడ అంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

Updated Date - 2022-12-31T11:43:32+05:30 IST