జగన్ ప్రభుత్వం నిధులు దారి మళ్లించింది
ABN , First Publish Date - 2022-08-04T09:11:32+05:30 IST
జగన్ ప్రభుత్వం నిధులు దారి మళ్లించింది
ఏపీ సర్పంచ్‌ల ఆవేదన.. ఢిల్లీ ఏపీ భవన్ వద్ద ధర్నా
న్యూఢిల్లీ, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి) జగన్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధులను దారిమళ్లించి వాడుకుందని, నిధులు లేక తాము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించి ఉందని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఆర్థిక సంఘం నిధులను కేంద్రం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఢిల్లీ ఏపీ భవన్‌లోని అంబేడ్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం గుంటూరు అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, ఏపీ పంచాయతీ పరిషత్ ఉపాధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నిధులను మళ్లించడం వల్ల రాష్ట్రంలోని పంచాయతీల పరిస్థితి దారుణంగా ఉందన్నారు.