జగన్ ఢిల్లీ టూర్ గోప్యతపై ప్రజల్లో పలు అనుమానాలు: కనకమేడల
ABN , First Publish Date - 2022-06-04T00:01:27+05:30 IST
సీఎం జగన్ ఢిల్లీ టూర్ గోప్యతపై ప్రజల్లో పలు అనుమానాలున్నాయని ఎంపీ కనకమేడల రవీంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అమరావతి: సీఎం జగన్ ఢిల్లీ టూర్ గోప్యతపై ప్రజల్లో పలు అనుమానాలున్నాయని ఎంపీ కనకమేడల రవీంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని, హోంమంత్రితో జగన్ ఏం మాట్లాడారో ఎందుకు చెప్పట్లేదు? అని ప్రశ్నించారు. కేంద్రాన్ని జగన్ ఏం అడిగారో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. స్వప్రయోజనాల కోసం కేంద్రానికి ఏపీని తాకట్టుపెట్టారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధానాల్ని కాగ్ తప్పుబట్టినా.. జగన్ మాత్రం లెక్కలెందుకు బహిర్గతం చేయడంలేదు? అని కనకమేడల రవీంద్ర ప్రశ్నించారు.