జగన్ లాంటి సీఎంను నా జీవితంలో చూడలేదు: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-02-24T23:39:24+05:30 IST
జగన్ లాంటి సీఎంను నా జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు. నా గవర్నమెంటు నా ఇష్టం అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారు
అమరావతి: ‘‘జగన్ లాంటి సీఎంను నా జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు. నా గవర్నమెంటు నా ఇష్టం అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారు’’ అని టీడీపీ అధినేత చందబాబు ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని దుయ్యబట్టారు. సర్పంచ్లను జగన్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తప్పుబట్టారు. గ్రామాల్లో ఆడిటింగ్ కూడా సర్పంచ్ల ఆధ్వర్యంలో జరగాలన్నారు. జగనుకు రాజ్యాంగం ఎలాంటి హక్కులిచ్చిందో.. సర్పంచులకూ రాజ్యాంగం అలాంటి హక్కులే ఇచ్చిందని గుర్తుచేశారు. పంచాయతీలకు రావాల్సిన డబ్బును రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటే.. దొపిడీ అనాలా..? ఇంకేమైనా అనాలా..? అని చంద్రబాబు ప్రశ్నించారు.