జగన్‌రెడ్డికి ఇంటికెళ్లే సమయమొచ్చింది

ABN , First Publish Date - 2022-08-17T09:15:06+05:30 IST

‘సీఎం జగన్‌రెడ్డికి టైం అయిపోయింది. ఇంటికెళ్లే సమయం దగ్గర పడింది. ఆయనవన్నీ టెన్త్‌ పాస్‌, డిగ్రీ ఫెయిల్‌ తెలివితేటలు.

జగన్‌రెడ్డికి ఇంటికెళ్లే సమయమొచ్చింది

వచ్చే వారం భారీ కుంభకోణం బయటపెట్టబోతున్నా: లోకేశ్‌

మంగళగిరి, ఆగస్టు 16: ‘సీఎం జగన్‌రెడ్డికి టైం అయిపోయింది. ఇంటికెళ్లే సమయం దగ్గర పడింది. ఆయనవన్నీ టెన్త్‌ పాస్‌, డిగ్రీ ఫెయిల్‌ తెలివితేటలు. ఆ అత్తెసరు తెలివితేటలతో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమా రాదు. ఉన్న పరిశ్రమలు వెళ్లిపోవడం తప్ప’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో సంజీవని ఉచిత ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో లోకేశ్‌ సారఽథ్యంలో ఇటీవల దుగ్గిరాల మండలంలో ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు. తాజాగా మంగళగిరిలో మరొకటి ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడారు. జగన్‌రెడ్డికి సంబంధించిన ఓ పెద్ద కుంభకోణం వచ్చే వారం బయటపెట్టబోతున్నట్లు లోకేశ్‌ ప్రకటించారు.

Read more