బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిదీ
ABN , First Publish Date - 2022-12-03T01:26:08+05:30 IST
బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. ఆ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు ప్రజలు తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కలెక్టర్ దినేష్‌కుమార్
ఒంగోలు (కలెక్టరేట్), డిసెంబరు 2 : బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. ఆ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు ప్రజలు తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాల నివారణపై ఐసీడీఎస్, డీఆర్‌డీఏ, మెప్మా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్య వివాహాల్లో ప్రకాశం జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉందని, ఈ పరిస్థితి మారేలా చర్యలు చేపట్టాలన్నారు. లింగ వివక్ష చూపకుండా, బాల్య వివాహాలు చేయకుండా ఆడపిల్లను ఉన్నత చదవులు చదివించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. అనంతరం చర్చి సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యురాలు బత్తుల పద్మావతి, డీఆర్‌డీఏ పీడీ బాబూరావు, మెప్మా పీడీ రవికుమార్, మహిళలు పాల్గొన్నారు.