ISB: చంద్రబాబును చూసేందుకు ఐఎస్బీ స్టూడెంట్స్ ఆసక్తి
ABN , First Publish Date - 2022-12-16T18:17:16+05:30 IST
ఐఎస్బీ (ISB) 20 ఏళ్ల వార్షికోత్సవ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) హాజరయ్యారు.
హైదరాబాద్: ఐఎస్బీ (ISB) 20 ఏళ్ల వార్షికోత్సవ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) హాజరయ్యారు. 11 ఏళ్ల క్రితం ఐఎస్బీ క్యాంపస్లో చంద్రబాబు నాటిన చెట్టును ఈ సందర్భంగా పరిశీలించారు. ఐఎస్బీ సిబ్బందితో కలిసి చంద్రబాబు కలియతిరిగారు. చంద్రబాబును చూసేందుకు ఐఎస్బీ స్టూడెంట్స్ (ISB students) ఆసక్తిచూపించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ యువత చాలా శక్తివంతమైనదని కొనియాడారు. హైదరాబాద్ (Hyderabad)లో ఐటీ డెవలప్ కోసం మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చానని, నగరంలో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ స్థాపించానని తెలిపారు. హైటెక్ సిటీ (HiTech City) నిర్మాణం తరువాత ఐటీ రంగం పురోగమించిందని తెలిపారు. తరువాత చాలా కంపెనీలు హైదరాబాద్ వచ్చాయని గుర్తుచేశారు. విజన్ 2020 అన్నప్పుడు చాలామంది ఎగతాళి చేశారని, విజన్-2020 కల నేడు సాకారమైందన్నారు. విజన్-2020 లక్ష్యంతో ప్రారంభించిన సంస్థలు నేడు ఉజ్వలంగా ఉన్నాయని గుర్తుచేశారు. ప్రపంచ స్థాయి సంస్థలు ఎన్నో ఆవిర్భవించాయని చంద్రబాబు తెలిపారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఎస్బీ ఎదిగింది. ఉమ్మడి రాష్ట్రంలో నాడు ఐఎస్బీ ఏర్పాటుకు చంద్రబాబు కృషి చేశారు. 2001లో నాటి ప్రధాని వాజ్పేయి చేతుల మీదుగా ప్రారంభమైన ఐఎస్బీ సంస్థ ప్రారంభించారు. ఆర్ధికవ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, పారిశ్రామికరంగానికి సూక్ష్మస్థాయి నైపుణ్యాలలో శిక్షణ పొందిన యువకుల అవసరం ఉన్నదని గుర్తించి 1996లో కొందరు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు ఆసియాలో ఒక ప్రపంచస్థాయి ప్రత్యేక వ్యాపార కళాశాల ఏర్పాటుకు పూనుకున్నారు. తదనుగుణంగా, ఏడాదిలోపే వార్టన్ స్కూల్, కెల్లాంగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్తో కలిసి ఒక అంతర్జాతీయ అకడమిక్ కమిటీ ఏర్పడింది. ఆ తర్వాత లండన్ బిజినెస్ స్కూల్ కూడా బోర్డులో భాగస్వామి అయింది.