వైసీపీ రాజకీయ ప్రయోజనాలకే ఉపయోగపడతారా?
ABN , First Publish Date - 2022-10-07T08:49:47+05:30 IST
వైసీపీ రాజకీయ ప్రయోజనాలకే ఉపయోగపడతారా?
మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ని నిలదీసిన అనిత
అమరావతి, అక్టోబరు 6(ఆంధజ్ర్యోతి): మహిళా కమిషన్‌ను రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ విమర్శల కోసం ఆ సంస్థ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వాడుకుంటున్నారని తెలుగు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. రాజకీయ లబ్ధి ఉన్నప్పుడే మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్పందిస్తారా? అని నిలదీశారు. సత్యసాయి జిల్లాలో తాజాగా జరిగిన ఘటనపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్పందించడం సంతోషదాయకమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 40 అఘాయిత్యాలు జరిగాయన్నారు. వాటిలో ఎన్నింటిపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్పందించారో చెప్పాలంటూ కొన్ని వివరాలను అనిత తన ట్వీట్‌లో పేర్కొన్నారు.