ప్రభుత్వ కార్యక్రమమా.. ఎన్నికల శంఖారావమా..?
ABN , First Publish Date - 2022-12-31T05:46:08+05:30 IST
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ముఖ్యమంత్రి జగన్ నిర్వహించింది ప్రభుత్వ కార్యక్రమమా లేక ఎన్నికల శంఖారావమో స్పష్టం చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ డిమాండ్ చేశారు.
సీఎం జగన్ నర్సీపట్నం సభపై స్పష్టత ఇవ్వాలి: జనసేన
డాబాగార్డెన్స్(విశాఖ), డిసెంబరు 30: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ముఖ్యమంత్రి జగన్ నిర్వహించింది ప్రభుత్వ కార్యక్రమమా లేక ఎన్నికల శంఖారావమో స్పష్టం చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నర్సీపట్నంలో ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన జగన్ ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దత్తపుత్రుడు, దుష్టచతుష్టయం అంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని, రాజకీయాల గురించి జగన్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఆర్టీసీ బస్సులన్నీ సీఎం సభకే తరలించారన్నారు. రూ.10 లక్షల కోట్లు అప్పుచేసి పాలన సాగించడం ఏమిటో అర్థం కావడం లేదని విమర్శించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీ నేతలను చెప్పుతో కొడతారని శివశంకర్ అన్నారు.