మాధవ్‌ వీడియోపై విచారణ చేయండి

ABN , First Publish Date - 2022-08-17T09:14:01+05:30 IST

ఎంపీ గోరంట్ల మాధవ్‌ అశ్లీల వీడియో క్లిప్‌పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీబీఐ సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ సెల్‌ (చెన్నై) జాయింట్‌ డైరెక్టర్‌కు హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ లేఖ రాశారు.

మాధవ్‌ వీడియోపై విచారణ చేయండి

సీబీఐ సైబర్‌ క్రైమ్‌కు గూడపాటి లేఖ 

అమరావతి, అనంతపురం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ఎంపీ గోరంట్ల మాధవ్‌ అశ్లీల వీడియో క్లిప్‌పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీబీఐ సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ సెల్‌ (చెన్నై) జాయింట్‌ డైరెక్టర్‌కు హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ లేఖ రాశారు. గోరంట్ల మాధవ్‌ అశ్లీల వీడియో క్లిప్‌లో అంశాలు క్రిమినల్‌ నేరం కిందకు వస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి దారుణమైన ఉదంతాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని లక్ష్మీనారాయణ కోరారు. 


జిల్లా నుంచి బహిష్కరించాలి: అఖిలపక్షం

అశ్లీలవీడియోలో అడ్డంగా దొరికిపోయిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి బహిష్కరించాలని అఖిలపక్షం నేతలు డిమాండ్‌ చేశారు. అనంతపురంలో సీపీఐ, సీపీఎం, ఐద్వా, మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష చర్చావేదికలో నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

Read more