High court: విలీన ఎయిడెడ్ అధ్యాపకుల పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు

ABN , First Publish Date - 2022-11-24T17:51:24+05:30 IST

Amaravathi: విలీన ఎయిడెడ్ అధ్యాపకుల సర్వీస్ నిబంధనల‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి సర్వీస్ నిబంధనలు తయారు చేయకుండా ఎయిడెడ్ కాలేజీలను విలీనం చేయడం వల్ల సీనియర్ అధ్యాపకులు

High court: విలీన ఎయిడెడ్ అధ్యాపకుల పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు

Amaravathi: విలీన ఎయిడెడ్ అధ్యాపకుల సర్వీస్ నిబంధనల‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి సర్వీస్ నిబంధనలు తయారు చేయకుండా ఎయిడెడ్ కాలేజీలను విలీనం చేయడం వల్ల సీనియర్ అధ్యాపకులు ఎక్కువగా నష్టపోయారు. విలీనం చేసేటప్పుడు సీనియారిటీ, పదోన్నతి, ఇతర సర్వీస్ నిబంధనలు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వ అధ్యాపకులకు వర్తించే నిబంధనలు వీరికి వర్తింపచేయాల్సి ఉండగా.. తమ‌పై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమచూపడం సరికాదని విలీన ఎయిడెడ్ అధ్యాపకులు హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై గురువారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. విలీన ఎయిడెడ్ అధ్యాపకుల గత అనుభవాల దృష్ట్యా 100 శాతం సర్వీస్ వర్తింపచేయాలని, కమిషనర్‌కు పెట్టుకున్న అర్జీ‌పై 4 వారాల్లో పరిష్కారం చూపించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2022-11-24T17:51:26+05:30 IST