ద్వారకా తిరుమల ఆలయ ఈవోపై విచారణ
ABN , First Publish Date - 2022-02-06T02:13:45+05:30 IST
జిల్లాలోని ద్వారకా తిరుమల ఆలయ ఈవోపై అవినీతి ఆరోపణలపై

పశ్చిమ గోదావరి: జిల్లాలోని ద్వారకా తిరుమల ఆలయ ఈవోపై అవినీతి ఆరోపణలపై విచారణ జరిగింది. ఈవో, ఫిర్యాదుదారుడి స్టేట్‌మెంట్లను దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ భ్రమరాంబ రికార్డు చేశారు. విచారణ నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్‌కి భ్రమరాంబ అందజేయనున్నారు.
తనపై సాంబశివరావు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని ఈవో సుబ్బారెడ్డి తెలిపారు. సాంబశివరావు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. విజయవాడకు చెందిన కొందరు వ్యక్తులతో డబ్బులు ఇవ్వాలని తనను భయపెడుతున్నాడని ఆయన ఆరోపించారు. ఇప్పటికే సాంబశివరావుపై రెండుసార్లు ద్వారకాతిరుమల పీఎస్‌లో ఫిర్యాదు చేశానని ఈవో సుబ్బారెడ్డి వివరించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఈవో సుబ్బారెడ్డి తన దగ్గర రూ.10 లక్షలు వసూలు చేశారని ఫిర్యాదుదారుడు సాంబశివరావు తెలిపారు. డబ్బులు అడిగితే చంపేస్తానంటూ ఈవో బెదిరించారన్నారు. తనపై ఇప్పటికే రెండుసార్లు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేశారన్నరాు. దీనిపై దేవాదాయ శాఖ కమిషనర్‌కి ఫిర్యాదు చేశానన్నారు. న్యాయం చేయాలని కోరుకుంటున్నానని సాంబశివరావు పేర్కొన్నారు.