అంతరిక్ష వినియోగంలో సుస్థిరత దిశగా భారత్‌

ABN , First Publish Date - 2022-10-07T09:00:21+05:30 IST

అంతరిక్ష వినియోగంలో సుస్థిరత దిశగా భారత్‌

అంతరిక్ష వినియోగంలో సుస్థిరత దిశగా భారత్‌

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ 

పుట్టపర్తి, అక్టోబరు 6: ప్రపంచ దేశాలతో పోటీపడుతూ అంతరిక్ష వినియోగంలో సుస్థిరతను సాధించే దిశగా భారత్‌ దూసుకుపోతోందని ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ ఇండోర్‌ స్టేడియంలో బుధవారం మొదలైన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను గవర్నర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతరిక్ష సాంకేతికతను, దాని ప్రయోజనాలను ప్రజలకు, విద్యార్థులకు తెలిజేసేందుకే ఈ అంతరిక్ష వారోత్సవాలు ఉపయోగపడతాయని అన్నారు. అంతరిక్ష వ్యర్థాలను పర్యవేక్షించడానికి ఇస్రో ప్రాజెక్ట్‌ నేత్రని ప్రారంభించిందన్నారు. కక్ష్యలో సేవలు అందిచడానికి ఇస్రో స్పెడెక్ట్‌ అనే డాటిన్‌ ప్రయోగాన్ని కూడా అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పుదుచ్చేరిలో అంతరిక్ష కార్యకలాపాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.  కార్యక్రమంలో ఇస్రో డైరెక్టర్‌ రాజరాజన్‌, శ్రీసత్యసాయి ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ రత్నాకర్‌ తదితరులు గవర్నర్‌కు జ్ఞాపిక అందజేసి సత్కరించారు.

Updated Date - 2022-10-07T09:00:21+05:30 IST