తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-06-11T08:08:44+05:30 IST

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

 సర్వదర్శనానికి 17 గంటలు


తిరుమల, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి) : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులతో పాటు పది ఫలితాలు విడుదలైన నేపథ్యంలో భక్తులు శుక్రవారం ఉదయం నుంచే భారీగా తిరుమలకు చేరుకున్నారు. సాయంత్రం 7 గంటల సమయానికి సర్వదర్శన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండిపోయాయి. క్యూలైన్‌ లేపాక్షి మీదుగా ఆస్థానమండపం వరకు దాదాపు రెండు కిలోమీటర్లు వ్యాపించింది. వీరికి దర్శన సమయం 17 గంటలు పడుతోంది.  


నేటినుంచి జ్యేష్టాభిషేకం సేవా టికెట్లు

 ఈనెల 12నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న జ్యేష్టాభిషేకానికి సంబంధించిన సేవా టికెట్లు శనివారం నుంచి 13వ తేదీ వరకు తిరుమలలో కరెంట్‌ బుకింగ్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి. రోజుకు 600 టికెట్ల చొప్పున విడుదల చేస్తారు. ఒక్కో టికెట్‌ ధర రూ.400గా నిర్ణయించారు.  

Read more