రైతు భరోసా యాత్ర పోస్టర్ ఆవిష్కరణ
ABN , First Publish Date - 2022-12-16T00:27:21+05:30 IST
గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం రైతు భరోసా యాత్ర పోస్టర్లను ఆపార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు.
తెనాలి అర్బన్, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం రైతు భరోసా యాత్ర పోస్టర్లను ఆపార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ నెల 18న సత్తెనపల్లిలో పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ఆధ్వర్యంలో కౌలు రైతు భరోసా యాత్ర జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు జనసేన అండగా నిలవాలనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ రైతు యాత్ర చేపట్టారని వివరించారు. ఈ సందర్భంగా ఆస్తి పత్రాలపై సీఎం ఫొటోలను ముద్రించడాన్ని తప్పు పట్టారు.