ఈ నెల 17 నుంచి తిరుపతి-హుబ్లీ ప్యాసింజరు పునరుద్ధరణ

ABN , First Publish Date - 2022-10-14T12:22:29+05:30 IST

హుబ్లీ-తిరుపతి-హుబ్లీ ప్యాసింజరు రైళ్లను(Hubli-Tirupati-Hubli Passenger Trains) ఈ నెల 17వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నట్లు

ఈ నెల 17 నుంచి తిరుపతి-హుబ్లీ ప్యాసింజరు పునరుద్ధరణ

అనంతపురం/గుంతకల్లు: హుబ్లీ-తిరుపతి-హుబ్లీ ప్యాసింజరు రైళ్లను(Hubli-Tirupati-Hubli Passenger Trains) ఈ నెల 17వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు(Railway officials) గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.  07657 నెంబరు రైలు ఈనెల 17వ తేదీన తిరుపతిలో ఉదయం 6-10 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 1-10 గంటలకు గుంతకల్లుకు(Guntakallu) వచ్చి, రాత్రి 9-10 గంటలకు హుబ్లీకి(Hubli) చేరుకుంటుందని పేర్కొన్నారు. తిరుగు ప్రయాణపు రైలు (నెం. 07668) ఈ నెల 18వ తేఈన హుబ్లీలో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12-55 గంటలకు గుంతకల్లుకు వచ్చి, రాత్రి 9-50 గంటలకు తిరుపతికి చేరుతుందన్నారు. 

Read more