‘గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి’

ABN , First Publish Date - 2022-10-07T06:34:45+05:30 IST

జగ్గంపేట మండల పరిధిలోని గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ పట్నాయక్‌ సూచించారు.

‘గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి’

జగ్గంపేట, అక్టోబరు 6:  జగ్గంపేట మండల పరిధిలోని గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ పట్నాయక్‌ సూచించారు. గురువారం ఆయన జగ్గంపేట జగనన్న కాలనీలను పరిశీలించి అనంత రం మండల పరిషత్‌ కార్యాలయంలో గృహ నిర్మాణశాఖ ఏఈ సాయిబాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భండీ పీడీ సుధాకర్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని గృహ నిర్మాణ ంలో  జగ్గంపేట ప్రఽథమస్థానంలో ఉండేదని, మండలస్ధాయి అధికారులు బృందం కలిసి ఈ పేరును నిలిబెట్టుకోవా లన్నారు. మండల పరిధిలోని ఆరు సైట్లలో గృహ నిర్మాణా లు జరుగుతుండగా 50శాతం నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాలేదని ఎందుకు ప్రారంభించలేదో తెలుసుకుని లబ్ధిదారుల ను ప్రోత్సహిస్తూ నిర్మాణాలను చేపట్టాలన్నారు. నిర్మాణం చేపట్టని వారి లబ్ధిదారులు వద్దకు వెళ్లి వారి స్థితిగతులు తెలుసుకుని జేసీఐ రూ.35వేలతో వారికి ఏర్పాటు చేయాలన ్నారు. ఆయా కాలనీల్లో గృహనిర్మాణాలకు అవసరమయ్యే విద్యుత్‌ ప్రధానంగా నీటిసరఫరా వారికి అందేటట్లు చూడా లన్నారు. కాట్రావులపల్లిలోని జగనన్న కాలనీలో పూర్తిగా గృహ నిర్మాణాలు పూర్తిచేసి డిసెంబరు 21నాటికి రాష్ట్రవ్యాప్త ంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సుధాకర్‌ పట్నాయక్‌ తెలిపారు. డీఈ రాజకుమార్‌ మా ట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరు తప్పనిసరిగా గృహ నిర్మాణం వేగవంతం చే స్తామన్నారు. ఈ కార్యక్రమం లో ఎండీవో హరికృష్ణ, హౌసింగ్‌ డీఈ రాజకుమార్‌, వైసీపీ నాయకులు ఒమ్మ రఘురాం, ఉపసర్పంచ్‌ బండారు రాజా, గృహ నిర్మాణశాఖ ఇన్‌స్పెక్టర్‌ విష్ణు, సచివాలయ సిబ్బంది, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.



Updated Date - 2022-10-07T06:34:45+05:30 IST