ఏపీ హోంమంత్రి అలా.. ఎస్పీ ఇలా.. ఎంపీ మాధవ్ వీడియోపై ఏంటీ గందరగోళం!
ABN , First Publish Date - 2022-08-10T23:29:37+05:30 IST
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Hindupuram Mp Gorantla Madhav) వీడియో వైరల్ అవడం.. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగిన...

అమరావతి (Amaravathi): హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Hindupuram Mp Gorantla Madhav) వీడియో వైరల్ అవడం.. దాని వల్ల రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే గోరంట్ల మాధవ్ వీడియోకు సంబంధించిన స్టేట్మెంట్లు మాత్రం గందరగోళాన్ని కలిగిస్తున్నాయి.
తానేటి వనిత ఏమన్నారంటే...
మంగళవారం హోంమంత్రి తానేటి వనిత (Home Minister Taneti Vanitha) మీడియా సమావేశంలో మాట్లాడుతూ... మాధవ్ వీడియోను ఫోరెన్సిక్‌కు పంపామని...నిజమని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు.
ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ...
తాజాగా ఎస్పీ ఫకీరప్ప (Sp Pakirappa) మాట్లాడుతూ గోరంట్ల మాధవ్ వీడియోను ఇంకా ఫోరెన్సిక్‌కు పంపలేదని.. వైరల్ అయిన వీడియో ఫేక్ అని తెలిపారు. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోంమంత్రి ఒకలా.. ఎస్పీ మరోలా చెప్పడంతో టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ఉదాసీనత చూపుతోందని విమర్శిస్తోంది.
సజ్జల కూడా...
మాధవ్ వీడియో వైరల్ అయిన వెంటనే స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ..
ఆ వీడియోను ఫోరెన్సిక్ కు పంపామని.. తప్పు తేలితే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు..