AP ప్రభుత్వానికి High Courtలో ఎదురుదెబ్బ
ABN , First Publish Date - 2022-06-21T19:53:33+05:30 IST
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు(High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ(Visakha)లోని రాజీవ్ స్వగృహ(Rajiv Swagruha)కు ఇచ్చిన భూమి వేలంపై..

అమరావతి : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు(High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ(Visakha)లోని రాజీవ్ స్వగృహ(Rajiv Swagruha)కు ఇచ్చిన భూమి వేలంపై హైకోర్టు స్టే విధించింది. రాజీవ్ స్వగృహాకు ఇచ్చిన భూమిలో ఏపీ ప్రభుత్వం ఇళ్లు నిర్మించలేదు. రాజీవ్ స్వగృహ భూముల వేలానికి వైసీపీ ప్రభుత్వం(YCP Government) సిద్ధమైంది. మొత్తం 25 ఎకరాలు అమ్మాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయించింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు(Velagapudi Ramakrishna Babu) హైకోర్టును ఆశ్రయించారు. రామకృష్ణబాబు తరుఫున న్యాయవాది అశ్వినీకుమార్ వాదనలు వినిపించారు. మధ్యతరగతి వారి ఇళ్ల కోసం ఇచ్చిన స్థలాన్ని.. వేలం వేయడమేంటని లాయర్ అశ్వినీకుమార్ ప్రశ్నించారు. పిటిషనర్ వాదనతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. ప్లాట్లు వేలం వేయడానికి వీలు లేదని హైకోర్టు స్టే విధించింది.