క్షీర రామలింగేశ్వరస్వామికి హైకోర్టు న్యాయమూర్తి పూజలు
ABN , First Publish Date - 2022-11-21T02:22:19+05:30 IST
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు దంపతులు పశ్చిమగోదావరి జిల్లా క్షీర రామలింగేశ్వర స్వామిని
పాలకొల్లు అర్బన్, నవంబరు 20: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు దంపతులు పశ్చిమగోదావరి జిల్లా క్షీర రామలింగేశ్వర స్వామిని ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి దంపతులకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారికి ప్రత్యేక పూజలు, అమ్మవార్లకు కుంకుమ పూజలు చేశారు. ప్రత్యేక మండపంలో న్యాయమూర్తి దంపతులకు పండితాశీర్వాదం అనంతరం స్వామివారి శేష వస్త్రం, ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.