ఏపీ, తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు: వాతావరణ శాఖ
ABN , First Publish Date - 2022-09-09T12:58:10+05:30 IST
ఏపీ, తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు: వాతావరణ శాఖ
హైదరాబాద్: పశ్చిమ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నేడు ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు పడ్డాయి. కాప్రాలో గరిష్టంగా 8.0 సెం.మీ వర్షపాతం నమోదైంది. మల్కాజ్‌గిరిలో 7.4, సికింద్రాబాద్‌లో 6.7 సెం.మీ, ఖైరతాబాద్‌లో 6.7, అల్వాల్‌లో 6.5, షేక్‌పేట్ 6 సెం.మీ వర్షపాతం నమోదైంది.