అల్ప పీడన ప్రభావంతో ఆ జిల్లాలో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2022-10-06T17:55:28+05:30 IST

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో.. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

అల్ప పీడన ప్రభావంతో ఆ జిల్లాలో భారీ వర్షాలు

విజయవాడ : బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో.. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి విజయవాడలో కుండపోత వర్షం కురుస్తోంది. బెంజ్ సర్కిల్, సింగ్ నగర్, పాయకాపురం.. మొగల్రాజపురం, లబ్బీపేట, ఆటోనగర్ ప్రాంతాలన్నీ వర్షానికి జలమయమయ్యాయి. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరి రైతుల్లో ఆందోళన నెలకొంది. మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. 

Read more