AP News: దావులూరు టోల్‌గేట్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ABN , First Publish Date - 2022-09-24T15:14:47+05:30 IST

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు టోల్గేట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

AP News: దావులూరు టోల్‌గేట్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

విజయవాడ: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు టోల్గేట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గుడివాడలో కొనసాగుతున్న అమరావతి రైతుల అమరావతి టు అరసవల్లి కార్యక్రమానికి హాజరయ్యేందుకు భారీగా తరలివెళ్తున్న రైతులను, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలను దావులూరు టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మచిలీపట్నం మాజీ జడ్పీ చైర్ పర్సన్ గద్దె అనురాధ అడ్డుకొన్న పోలీసులు తిరిగి వెనక్కి పంపించేశారు. పోలీసుల తీరుపై టీడీపీ కార్యకర్తలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Read more