గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు ఇవ్వాలి: బొప్పరాజు

ABN , First Publish Date - 2022-10-17T10:29:09+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే హెల్త్‌ కార్డులు, ఏపీజీఎల్‌ఐ బాండ్లు జారీ చేయాలని ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు ఇవ్వాలి: బొప్పరాజు

విజయవాడ, అక్టోబరు 16 (ఆంధ్ర జ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే హెల్త్‌ కార్డులు, ఏపీజీఎల్‌ఐ బాండ్లు జారీ చేయాలని ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర స్థాయి సమావేశం ఆదివారం విజయవాడలో జరిగింది. మొత్తం 26 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ఇందులో బొప్పరాజు మాట్లాడుతూ, గ్రామ, వార్డు సచివాలయాలలో రెండో నోటిఫికేషన్‌ ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని, మరణించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో చెల్లించాలన్నారు. కుటుంబంలో అర్హులైన వారి కి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలని కోరారు. 


పాత పింఛను ఇవ్వండి..: 1999 ఫిబ్రవరి నుంచి 2004 ఆగస్టు మధ్య కాలంలో నియమించబడ్డ విద్యుత్తు ఉద్యోగులకు పాత పింఛను విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని విద్యుత్తు సౌధ జీపీఎఫ్‌ సాధన సమితి డిమాండ్‌ చేసింది. ఆదివారం అధ్యక్షుడు వి.వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ ఎ.సురేశ్‌బాబు, జి సత్యనారాయణ, వీవీఎస్‌ శ్రీకాంత్‌ తదితరుల నేతృత్వంలో గొల్లపూడిలో సమితి సమావేశం జరిగింది. జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 5,311 మంది ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు. 

Updated Date - 2022-10-17T10:29:09+05:30 IST