అమరావతి ప్రాజెక్టులు వేగం కావాలి: హర్దీప్‌సింగ్‌

ABN , First Publish Date - 2022-12-16T01:23:54+05:30 IST

అమరావతి స్మార్ట్‌ సిటీకి మంజూరు చేసిన ప్రాజెక్టుల పూర్తికి సంబంధించి మరింత వేగం అవసరమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి అభిప్రాయపడ్డారు.

అమరావతి ప్రాజెక్టులు వేగం కావాలి: హర్దీప్‌సింగ్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): అమరావతి స్మార్ట్‌ సిటీకి మంజూరు చేసిన ప్రాజెక్టుల పూర్తికి సంబంధించి మరింత వేగం అవసరమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పూరి అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతికి స్మార్ట్‌ సిటీ పథకం కింద మంజూరు చేసిన ప్రాజెక్టుల్లో ఒక్కటి కూడా పూర్తికాలేదని, ఎప్పటిలోగా ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తారని గురువారం లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మౌఖికంగా సమాధానమిచ్చారు. అమరావతిలో చేపట్టడానికి రూ.2046 కోట్ల విలువైన 21 ప్రాజెక్టులను గుర్తించామని, ప్రాజెక్టుల నిర్మాణానికి ఏర్పడిన స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌లో తాము, రాష్ట్ర ప్రభుత్వం రూ.488 కోట్ల చొప్పున జమ చేశామని, అందులో కేంద్రం నిధులు రూ.488, రాష్ట్ర నిధుల్లో రూ.290 కోట్లు ఖర్చయ్యాయని అన్నారు. ప్రాజెక్టుల పనుల పురోగతిపై చర్చించేందుకు తనను కలుసుకోవాల్సిందిగా గల్లా జయదేవ్‌ను కేంద్ర మంత్రి ఆహ్వానించారు.

Updated Date - 2022-12-16T01:23:55+05:30 IST