విద్యార్థినికి వేధింపులు.. టీచర్‌కి దేహశుద్ధి

ABN , First Publish Date - 2022-11-23T03:37:41+05:30 IST

విద్యార్థినిని వేధించిన ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన మంగళవారం తిరుపతి జిల్లాలో జరిగింది.

విద్యార్థినికి వేధింపులు.. టీచర్‌కి దేహశుద్ధి

పుత్తూరు, నవంబరు 22: విద్యార్థినిని వేధించిన ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన మంగళవారం తిరుపతి జిల్లాలో జరిగింది. పు త్తూరు మండలం వేపగుంట ప్రాధమికోన్నత పాఠశాలలో ఎన్‌.పి.గోపీనాథ్‌ సైన్స్‌ ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని వికృత చేష్టలతో రోజూ వేధిస్తున్నాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో గ్రామస్థులతో కలిసి గోపీనాథ్‌కు దేహశుద్ధి చేశారు.

Updated Date - 2022-11-23T03:37:41+05:30 IST

Read more