Guntur: రెండు ప్రత్యేక రైళ్ల రద్దు
ABN , First Publish Date - 2022-01-10T12:15:48+05:30 IST
ప్రయాణీకుల స్పందన కొరవడటంతో రెండు ప్రత్యేక రైళ్లని రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో సీహెచ్ రాకేష్ తెలిపారు
గుంటూరు: ప్రయాణీకుల స్పందన కొరవడటంతో రెండు ప్రత్యేక రైళ్లని రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో సీహెచ్ రాకేష్ తెలిపారు. నెంబరు. 07494 నరసపూర్ - కాచీగూడ ప్రత్యేక రైలు ఈ నెల 12న, నెంబరు. 07450 కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ఈ నెల 13న రద్దు చేశామన్నారు. ఇప్పటికే టిక్కెట్‌లు బుకింగ్ చేసుకొన్న వారికి నగదు వాపసు చేస్తామన్నారు.