Ayyanna ఇల్లు అక్రమ నిర్మాణమని ఇప్పుడు గుర్తొచ్చిందా? Sandyarani

ABN , First Publish Date - 2022-06-19T18:48:52+05:30 IST

అయ్యన్న ఇల్లు అక్రమ నిర్మాణమని ఇప్పుడు గుర్తొచ్చిందా? అంటూ సంధ్యారాణి ప్రశ్నించారు.

Ayyanna ఇల్లు అక్రమ నిర్మాణమని ఇప్పుడు గుర్తొచ్చిందా? Sandyarani

Amaravathi: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyanna patrudu) ఇంటిపై జేసీబీతో దాడి చేయడం దుర్మార్గమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి (Gummadi Sandyarani) అన్నారు. ఆదివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను బయటపెడితే ఇళ్లు కూల్చేస్తారా? అని ప్రశ్నించారు. మూడేళ్ల తరువాత ప్రతిపక్ష నేతలకు అయ్యన్న ఇల్లు అక్రమ నిర్మాణమని గుర్తొచ్చిందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అరాచకప్రదేశ్‌గా మార్చిన జగన్.. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న అయ్యన్నపాత్రుడుపై సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలను ఎదుర్కోలేక విధ్వంసాలు, విద్వేషాలు, కక్ష సాధింపు చర్యలతో ఏపీని అస్తవ్యస్థంగా చేస్తున్నారని విమర్శించారు. జగన్ పాలనలో ఆగడాలు, అకృత్యాలు, అతిప్రవర్తనలు హద్దు మీరుతున్నాయన్నారు. నేరపూరిత చర్యలతో అదుపు లేకుండా పోయిందన్నారు. A1 రాజ్యం పాలిస్తే ఎన్ని అనర్థాలో ప్రజలకు ఇప్పుడు అర్ధమైందని సంధ్యారాణి అన్నారు.

Updated Date - 2022-06-19T18:48:52+05:30 IST