గోవిందుడక్కడ.. క్యూ ఎక్కడో!
ABN , First Publish Date - 2022-10-07T08:42:11+05:30 IST
గోవిందుడక్కడ.. క్యూ ఎక్కడో!
సెలవులు ముగుస్తున్న సమయం.. పైగా తమిళులకు పవిత్రమైన పెరటాశి మాసం! ఇంకేముంది... తిరుమల కిటకిటలాడింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యానవనం షెడ్లూ నిండిపోయి.. రింగురోడ్డు మీదుగా శిలాతోరణం వరకు... రెండున్నర కిలోమీటర్ల పొడవునా భక్తులు క్యూ కట్టారు. సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతుందని గురువారం సాయంత్రం టీటీడీ ప్రకటించింది. గదుల కోసం నాలుగైదు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి. కల్యాణ కట్టలు, లడ్డూ కౌంటర్లు, అఖిలాండం, అన్నప్రసాద భవనం... ఎటు చూసినా భక్త జనమే!
- తిరుమల